VSP: ఏయూ జియో ఇంజనీరింగ్ విభాగంలో స్టూడెంట్ సొసైటీ ఉర్వికృతి ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన పోస్టర్లను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య పి.జగదీశ్వర రావు, విద్యార్థులు జి. ఆశిష్, డి.ఎస్.ఎస్ చంద్రవర్ధన్, ఆర్. రిషి తదితరులు పాల్గొన్నారు