AP: మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సకల జనులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘జ్ఞానం సముపార్జనకు పరిమితిలేదని నిరూపించిన మహనీయుడు వాల్మీకి మహర్షి. పరిస్థితుల ప్రభావం వల్ల కిరాతకుడిగా వ్యవహరించినా.. తపస్సుతో మహనీయుడుగా మారి ప్రపంచానికే జ్ఞాన జ్యోతిని చూపించిన కారుణ్యమూర్తి ఆయన. మహర్షి వాల్మీకి జీవితం ఈ సృష్టి ఉన్నంతకాలం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’ అని కొనియాడారు.