VSP: కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థినులతో ఆయన మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులకు అందిస్తున్న వైద్యం గురించి కేజీహెచ్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.