అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరు ఆర్టీసీ డిపోను విజయనగరం ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర సందర్శించారు. డిపో మేనేజర్‌తో కలిసి డిపో పరిధిలోని స్థలాలను పరిశీలించారు. ఆర్టీసీ స్థలాలను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని, కార్మికులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గిరిజన ప్రాంత ప్రజలకు బస్సులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.