TG: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించటాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందన్నారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు అని చెప్పారు. ఇది వ్యక్తిపై దాడి కాదని, వ్యవస్థపైనే దాడి అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.