MNCL: జన్నారం మండల కేంద్రంలోని పలు కాలనీలలో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జన్నారంలోని శ్రీలంక కాలనీ, రామ్ నగర్, జువ్విగూడా, బుడగ జంగాల కాలనీ, సుందరయ్య నగర్, తదితర కాలనీలలో వరదనీరు నిలిచిపోయింది. ఆ కాలనీలలో డ్రైనేజీలు లేకపోవడంతో వరద నీరు పోయే అవకాశం లేదని వారు వాపోయారు.