ASF: నేషనల్ కం మెరిట్ స్కాలర్షిప్(NMMSS) దరఖాస్తు గడువు ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు ఆసిఫాబాద్ జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత గలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.