NRPT: మరికల్ మండల కేంద్రంలోని వాల్మీకి దేవాలయంలో మంగళవారం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని అఖిలపక్ష నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృత అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. సామాన్య ప్రజలకు రామాయణం అర్థమయ్యే విధంగా రామాయణాన్ని రచించిన వాల్మీకిని అందరు గుర్తుంచుకోవాలని కోరారు.