BHNG: యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ నెయ్యి సరఫరా మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 రోజుల నుంచి నెయ్యి వినియోగం ప్రారంభించారు. KG రూ. 609 చొప్పున సరఫరా చేస్తున్నారు. గత 35 సంవత్సరాలుగా మదర్ డెయిరీ సంస్థ ఈ బాధ్యతను నిర్వర్తించింది. ప్రసాదాలు, నైవేద్యం తయారీ కోసం దేవస్థానంలో నెలకు సుమారు 30 వేల కిలోల నెయ్యి వినియోగిస్తున్నారు.