KRNL: ఈనెల 16న ప్రధాని మోదీ కర్నూలు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి జి.వీరపాండియన్‌కు మంగళవారం బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా ఆయన వ్యవహరించనున్నారు. అమరావతి, విశాఖ పర్యటనల్లో విజయవంతంగా సేవలందించిన ఆయనకు కర్నూలు ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించారు.