‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యష్ మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ‘సర్దార్’ ఫేమ్ PS మిత్రన్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారట. ఈ మేరకు యష్‌కు దర్శకుడు కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పారట. సైన్స్ ఫిక్షన్ కథతో రాబోతున్న ఈ సినిమా 2026లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.