JGL: జగిత్యాల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం బయటకు పంపివేయడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ శాఖ మంత్రి లక్ష్మణ్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.