E.G: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయ్‌పై లాయర్ కిషోర్ చెప్పు విసిరిన సంఘటనను ఖండిస్తూ KVPS ఆధ్వర్యంలో మంగళవారం నిడదవోలులో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా KVPS జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ.. చీఫ్ జస్టిస్‌పై దాడి సనాతన మనువాద మతోన్మాది కుల దురహంకారం అన్నారు. ఇలాంటి వారికి బీజేపీ, RSS శక్తులు ఊతం ఇస్తున్నాయని విమర్శించారు.