కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ఈనెల 10వ తేదీ నుంచి జరిగే శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా రవాణా అధికారి రాఘవ కుమార్ తెలిపారు. జిల్లాలోని నాలుగు డిపోల నుంచి ప్రతి శనివారం 25 బస్సులు నడుపుతున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు కోనసీమతోపాటు రాజమండ్రి నుంచి కూడా అదనపు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.