KRNL: హైదరాబాద్ నుంచి ఆదోనికి వస్తున్న శ్రీనివాస ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ఉండగా అందరూ క్షేమంగా బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.