కొత్త మొబైల్ యూజర్లకు సంబంధించి ఆగస్టులో రిలయన్స్ జియో జోరు కొనసాగగా.. ప్రభుత్వ రంగ BSNL దాదాపు ఏడాది తర్వాత భారతి ఎయిర్ టెల్ను అధిగమించింది. ఆగస్టులో 35.19 లక్షల కొత్త కనెక్షన్లు నమోదయ్యాయి. అందులో జియో కస్టమర్లు అత్యధికంగా 19 లక్షలు, BSNL కస్టమర్లు 13.85 లక్షలు, ఎయిర్ టెల్ కస్టమర్లు 4.96 లక్షల మంది ఉన్నారు.