TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేయడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించిన ఎన్నికల సంఘం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై BNS 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదైంది.