AP: విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలొచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో బారులుతీరారు. ఆలయ ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబసభ్యులతో వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు తదితరులు దర్శించుకున్నారు.