ATP: రామాయణాన్ని రచించి రాముడు చరిత్రను యావత్ భారతదేశానికి పరిచయం చేసిన మహోన్నతుడు వాల్మీకి మహర్షి అని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మంగళవారం గుంతకల్లు పట్టణంలోని వాల్మీకి జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా వాల్మీకి మహర్షికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.