HYD: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ భారీ చోరీ వెలుగు చూసింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారంతో పాటుగా నగదును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు. ఆ ఇంటి చుట్టుపక్కలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.