VKB: సోషల్ మీడియా లైకుల కోసం ఏమైనా చేయడం వ్యసనమేనని కుల్కచర్ల ఎస్సై రమేశ్ యువతను ఉద్దేశించి చెప్పారు. ఆన్లైన్ ఫాలోవర్స్ కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఆశయాలను సాధించడంలో యువత ముందుండాలని పేర్కొన్నారు. సైబర్ మోసగాళ్ల చేతుల్లో మోసపోవద్దని పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.