TPT: దివంగత డీసీఎంస్ ఛైర్మన్ పల్లినేని సుబ్రమణ్యం నాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ మంగళవారం పరామర్శించారు. నారావారి పల్లె నుంచి రోడ్డు మార్గంలో పనపాకం చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుబ్రమణ్యం నాయుడు మృతి తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.