KMR: బీర్కూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ శ్రీలేఖ, డా.నాగ గిరీష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున మహిళలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలకు రక్తహీనత తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.