నెల్లూరులోని వేదయపాలెం పరిధిలో పోలీసులు సోమవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వేదయపాలెం సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో 74 మంది పోలీసులతో చేపట్టిన ఈ ఆపరేషన్లో, సరైన పత్రాలు లేని 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 7 మంది రౌడీ షీటర్లు, 13 మంది అనుమానితులను తనిఖీ చేసి, వారి వేలిముద్రలను సేకరించారు.