VZM: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత మంగళవారం శ్రీపైడితల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయం చుట్టూ తిరిగి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో శిరీష ప్రధాన న్యాయమూర్తికి అమ్మవారి తీర్థప్రసాదాలు, ఫోటోను అందజేశారు.