CTR: వైసీపీని గ్రామస్థాయిలో బలోపేతం చేయనున్నట్టు పూతలపట్టు సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం మాజీ జడ్పీ ఛైర్మన్ కుమార్ రాజా గృహంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కార్య కర్తల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.