మెదక్ పట్టణంలో బ్రహ్మ కమలం పుష్పం వికసించింది. స్థానిక వనపర్తి శ్రీనివాస్, జయ దంపతుల నివాసంలో సోమవారం రాత్రి బ్రహ్మ కమలం పుష్పం వికసించింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే బ్రహ్మ కమలం పుష్పం పౌర్ణమి రోజు తమ నివాసంలో వికసించడంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. బ్రహ్మ కమలం పుష్పంకు మంగళ హారతులతో ప్రత్యేక పూజలు జరిపారు.