JN: స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా మారపాక అన్వేష్, గడ్డం పావని (22) ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా ఈ ఘటనలో ప్రియుడు మారపాక అన్వేష్ మృతిచెందగా ప్రియురాలు పరిస్థితి విషమంగా ఉంది.