NLR: అర్జీదారులు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్, అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఏ శాఖ పరిధిలో కూడా అర్జీలు పెండింగ్లో ఉండకూడదన్నారు.