ADB: ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఉద్యమించిన అలుపెరుగని పోరాట వీరుడు కొమరం భీమ్. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మారుమూల గ్రామమైన జోడేఘాట్ గ్రామంలో ఈయన జన్మించారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు కొమరం భీమ్. అందుకే ఆయన్ను ఆదివాసీలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు.