AP: ఉద్యాన పంటలను సాగుచేస్తున్న రైతులను ఆఫ్రికా నత్తలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాల్లోని పంటలను పీల్చి పిప్పి చేస్తుండటంతో.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పామాయిల్, బొప్పాయి, కోకో వంటి పంటలపై చేరి కాండం నుంచి రసం పీల్చి వేయడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ ఆఫ్రికా నత్తల సమస్యతో రైతులు భారీగా నష్టాల పాలవుతున్నారు.