KMR: పిట్లం మండలంలోని తిమ్మానగర్ గ్రామ శివారులో కాకి వాగు, నల్ల వాగు పొంగి పొర్లుతోంది. ఈ వరద ప్రవాహంలో ఫక్రియా అనే వ్యక్తి చిక్కుకున్నాడు. గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన సహాయక బృందం తక్షణమే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వరద ఉధృతి నుంచి ఆ రైతును సురక్షితంగా రక్షించి, ఒడ్డుకు చేర్చారు.