VZM: ఎస్.కోట పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడటంతో రాకోటి దారగిరి అనే గొర్రెల కాపరికు సంబంధించిన 13 గొర్రెలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు ఆందోళన చెందాడు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని అతను కోరాడు.