WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో సోమవారం వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా NSPT అటవీ శాఖ రేంజ్, లీడ్ ఫౌండేషన్ సంయుక్తంగా వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాయి. ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు FRO రవి కిరణ్ బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. వన్యప్రాణులు, అడవులను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.