అన్నమయ్య: పుంగనూరు నిమ్మనపల్లిలోని దిగువపల్లె వద్ద సోమవారం కొంతమంది కలసి పేకాట ఆడుతుండడంపై పోలీసులకు సమాచారం అందిందని ఎస్సై తిప్పేస్వామి అన్నారు. దీంతో ఎస్సై తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై డ్రోన్ కెమెరాతో దాడులు జరిపి ఏడుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.20,850/- లను, 7 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. కాగా, ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.