బాపట్ల: పట్టణంలోని ఇస్లాంపేటలో కోతుల స్వైరవిహారం వల్ల ప్రజలు భయపడుతున్నారు. ఇళ్లపై పడి తినుబండారాల కోసం సామాన్లు చిందరవందర చేయడంతోపాటు, అడ్డు వచ్చిన మనుషులను గాయపరుస్తున్నాయి. సోమవారం సాయంత్రం కోతుల దాడిలో ఒక మహిళకు గాయాలయ్యాయి. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపించి, కోతుల బెడదను తగ్గించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.