CTR: పుంగనూరు పట్టణం ప్రకాశం కాలనీలో ఓం శక్తి అమ్మవారి ఆలయం సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తూ కుంకుమార్చనలు, పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కాలనీవాసుల అందరి సహకారంతో ఆలయాన్ని నిర్మించుకుని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.