BDK: బీటీపీఎస్ నుంచి మణుగూరుకి వెళ్లే 12 కిలోమీటర్ల రహదారిపై ఏర్పడిన పెద్ద గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గోతుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని మంగళవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు లారీల దుమ్ము, మరోవైపు పెద్ద పెద్ద గుంతలతో వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరారు.