NLG: విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే లక్ష్యాలను ఏర్పచుకుని పట్టుదల,క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ దెందె ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ వికాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు నిత్య సాధనతో మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.