VZM: పైడితల్లి అమ్మవారి పండగ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. మంగళవారం 80 బస్సులు, బుధవారం 30 బస్సులను విశాఖపట్నం, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట, రూట్లలో తిప్పుటకు ఏర్పాటు తెలియజేశారు. భక్తులు RTC బస్సులను ఉపయోగించుకోవాలన్నారు.