సత్యసాయి: సోమందేపల్లి మండలం ఈదులబలాపురం చెరువు కట్టకు గండి పడింది. ఇటీవల కురిసిన వర్షానికి మంచేపల్లి చెరువు మరువ పారడంతో బాలాపురం చెరువుకు భారీ వర్షపు నీరు చేరడం వల్ల చెరువు కట్టకు గండి పడింది. టీడీపీ నాయకులు నరసింహమూర్తి, ఆయకట్టు ప్రెసిడెంట్ కిష్టప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్ సోమవారం ఇసుక మూటలు వేసి తాత్కాలికంగా నీరు బయటకు వెళ్లకుండా చేశారు.