MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి వద్ద చికెన్ దుకాణదారుల మధ్య జరిగిన గొడవలో మహబూబ్ (35) హత్యకు గురయ్యాడు. మహబూబ్ సోదరి సుల్తానా, విటల్లకు పక్కపక్కనే చికెన్ దుకాణాలు ఉన్నాయి. వ్యాపారం విషయంలో ఆదివారం సుల్తానా, విటల్ మధ్య గొడవ జరిగింది. విషయం తెలిసి వచ్చిన మహబూబ్‌ను విటల్, కుటుంబీకులు దాడి చేయగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.