ATP: జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాజశేఖర్ పసిబిడ్డ మృతి ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటనను సుమోటో కేసుగా తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. ఆయన శిశుగృహంలో సిబ్బందిని ప్రశ్నించి బిడ్డ రాక, సంరక్షణ, అనారోగ్యం, ఆహార పరిస్థితులపై వివరాలు సేకరించారు. మిషన్ శక్తి సమన్వయకర్త శ్రీదేవి తదితరులతో మాట్లాడారు.