JGL: భీమారం మండలంలోని మన్నెగూడెంలో కుక్క దాడిలో వాసం గంగు అనే మహిళ సోమవారం తీవ్రంగా గాయపడింది. ఇంట్లో పడుకుని ఉన్న ఆమెపై కుక్క చొరబడి విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. గంగును వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.