KRNL: పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సీడీపీవో అనురాధ అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. సోమవారం సల్కాపురంలో అంగన్వాడీ సెంటర్లో పౌష్టిక ఆహారంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. వారికి పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.