GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జులై నెలలో జరిగిన ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ రెగ్యులర్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల సర్వ నియంత్రణ అధికారి ఆచార్య ఆలపాటి శివప్రసాద్ సోమవారం విడుదల చేశారు. పరీక్షలు వ్రాసిన 73మంది విద్యార్థులకు గాను 64 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలన్నారు.