ADB: చదువుతో అభివృద్ధికి పునాదని, సెలవులు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థినులను కళాశాలకు పంపాలని ఉట్నూరు పట్టణంలోని తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు బుర్ర మానస కోరారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ హరిత ఆదేశాల మేరకు సోమవారం ఉట్నూర్ మండలంలోని టక్కుగూడ, శ్యాంపూర్ గ్రామాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆమె క్వెస్ట్ కార్యక్రమంలో పది అంశాలను తెలిపారు.