తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నాటు సారా తయారు చేసినా, రవాణా చేసినా, అమ్మకాలు జరిపినా వెంటనే కాల్ సెంటర్ 14405 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం జిల్లా ఎక్సైజ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాటుసారా నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.