TPT: రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు జిల్లాకు రానున్నారు. ఇవాళ రాత్రి 11:15 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన స్వగ్రామం నారావారిపల్లె చేరుకుంటారు. రేపు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు సంవత్సరీకంలో పాల్గొంటారు. అనంతరం రేపు సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.