NZB: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలిస్ సిబ్బంది విధుల పట్ల అంకితభావం కలిగి ఉండాలని, ఎన్నికల సమయంలో ప్రత్యేక దృష్టి సారించాలని డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. వినోద్ సూచించారు. సోమవారం డిచ్ పల్లి సర్కిల్ పరిధిలోని ఇందల్ వాయి పోలిస్ స్టేషన్లో సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏది జరిగిన వెంటనే తమపై అధికారికి సమాచారం అందించాలన్నారు.